కరోనా వైరస్‌ను కప్పిపుచ్చి.. ప్రపంచదేశాలకు చైనా నష్టాన్ని కలిగించిందని అమెరికాకు చెందిన మిస్సోరి రాష్ట్రం కేసు వేసింది. చైనా ప్రభుత్వంతో పాటు ఆ దేశ కమ్యూనిస్టు పార్టీపై అమెరికా కోర్టులో కేసు నమోదు అయ్యింది. కోవిడ్19 మహమ్మారిపై కావాలనే చైనా నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు తన అఫిడవిట్‌లో మిస్సోరి రాష్ట్రం పేర్కొన్నది. ప్రపంచదేశాలకు చైనా ప్రభుత్వం అబద్దాలు చెప్పిందని, విజిల్‌బ్లోయర్లను సైలెన్స్ చేసిందని, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఎటువంటి శ్రద్ధ చూపలేదని మిస్సోరి రాష్ట్ర అటార్నీ జనరల్ ఎరిక్ స్కిమిట్ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన చైనా బాధ్యత తీసుకోవాలన్నారు. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినందుకు, మనుషుల్ని ఇబ్బందికి గురి చేసినందుకు, తీవ్ర ఆర్థిక కష్టాలను కలిగించినందుకు తమకు నష్టపరిహారం ఇవ్వాలని మిస్సోరి రాష్ట్రం డిమాండ్ చేసింది. కానీ చైనా మాత్రం కరోనా అంశంలో ఎటువంటి తప్పుచేయలేదని పేర్కొన్నది. మిస్సోరి అధికారులు తమ న్యాయపరిహార కేసును చరిత్రాత్మకంగా వర్ణించారు. మిస్సోరి రాష్ట్రం వేసిన కేసులో అమెరికా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
చైనాపై మిస్సోరి దావా
Related tags :