కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో ఈ ఏడాది ప్రఖ్యాత అమర్‌నాథ్ యాత్ర ఉంటుందా లేదా అనేది సందిగ్ధంలో పడింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, శ్రీ అమర్‌నాథ్ మందిర బోర్డు (ఎస్ఏఎస్‌బీ) చైర్మన్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన బుధవారంనాడు రాజ్‌భవన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమర్‌నాథ్ యాత్ర రద్దుపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకునట్టు ఓ ప్రకటన కూడా విడుదలైంది. అయితే, కొద్ది సేపటికే ఆ ప్రెస్‌నోట్‌ను ఉపసంహరించుకున్నట్టు జమ్మూకశ్మీర్ సమాచార డైరెక్టరేట్ ప్రకటించింది.కశ్మీర్ లోయలో 77 రెడ్ జోన్లు ఉండగా, ఇవి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే మార్గంలోనే ఉన్నాయి. క్యాంపుల ఏర్పాటు, ఆహార వసతి, వైద్య సదుపాయాలు, మంచు తొలగించడం వంటి చర్యలు చేపట్టడం అసాధ్యమని లెఫ్టినెంట్ గవర్నర్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకూ లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండాయనేది కూడా ఇప్పుడే చెప్పలేమని, ప్రయాణుకుల భద్రతే అన్నింటికన్నా ముఖ్యమని సమావేశం అభిప్రాయడింది. ఏకగ్రీవంగా అమర్‌నాథ్ యాత్ర రద్దుకు నిర్ణయించింది. దీనిపై ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే, కొద్ది నిమిషాలకే ప్రెస్‌నోట్ ఉపసంహరించుకుంటూ మరో ప్రకటన వెలువడింది. దీంతో అమర్‌నాథ్ యాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది..
యాత్ర రద్దు అన్నారు. తర్వాత కాదన్నారు.
Related tags :