* మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ27 కొత్త పాజిటివ్ కేసులుఇవాళ్టి 27 కేసుల్లో కేవలం హైదరాబాద్ లోనే 13 కేసులు నమోదుఇవ్వాళ కొత్తగా జోగులంబ గద్వాల్ జిల్లాలో 10 కొరొనా కేసులు నమోదుమొత్తం 970కి చేరిన కొరొనా పాజిటివ్ఇవ్వాళ ఒక మృతి 25కు చేరిన మరణాలు58 మంది డిచార్జ్ అయ్యాయి262మొత్తం డిచార్జ్ అవ్వడం జరిగింది693 మంది ఆక్టీవ్ కేసులు ప్రస్తుతం ఉన్నాయి
* ఆంద్రప్రదేశ్ లోని పాతపట్నం… సిది గ్రామంలో మత్యకారుడికి పాజిటివ్. శ్రీకాకుళం జిల్లాలో మొట్ట మొదటి కేసు.
* కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి ప్రభావం మరింత ఎక్కువ అవుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 31 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో జిల్లా వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 234కు చేరగా.. ఈరోజు ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. దీంతో కర్నూలు జిల్లాలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్ అవగా.. 223 మంది జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
* దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం నాటికి భారత్‌లో మొత్తం 21,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1409 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 681 మంది మృతి చెందగా.. 4,257 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 16,454 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.14 రోజులుగా 78 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 28 రోజులుగా 12 జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదని వివరించారు. కంటైన్‌మెంట్ ద్వారానే కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగామని తెలిపారు.
* లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కాలంలో దేశ ప్రజలకు స్వల్ప ఊరట లభించింది. లాక్‌డౌన్ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్ ప్రాంతాల్లో పలు మినహాయింపులు ఇచ్చింది. మొబైల్ రిచార్జ్, సిమెంట్, పుస్తకాల షాపులు వంటి వాటికి కేంద్రం లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు. గ్రామీణ ఆర్ఠిక వ్యవస్థను గాడిలా పడేసేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశంలో వైద్య సిబ్బందికి పూర్తి భద్రతను కల్పిస్తామన్నారు.
* కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా చూసేందుకు ఆయా రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.. వేసవి సెలవులు కాస్త ముందుకు జరపాలనే యోచనలో ఉన్నాయి.. అలాగే సరికొత్త అకడమిక్ క్యాలెండర్ రూపొందిస్తున్నాయి.
* ఏపీలో 893కు చేరిన కరోనా బాధితులు
* గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త సక్రూబాయ్ సేవలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. దివ్యాంగురాలైనా కూడా కరోనా వైరస్‌కు భయపడకుండా ఇంటింటికీ వెళ్లి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నందుకు ఆమెను కొనియాడింది. ఈ మేరకు ఆమెకు లేఖ రాసింది. దీనిపై సక్రూబాయ్ సంతోషం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతోనే వైకల్యాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
* ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ జన్యుపరంగా వివిధ మార్పులకు గురైనట్లు చైనా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ‘సార్స్-కొవ్-2’ వైరస్ ఇప్పటికే 30 కంటే ఎక్కువ జాతులుగా పరివర్తనం చెందిందని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేర్వేరు రూపాల్లో పంజా విసురుతోందని అందులో తేల్చారు. ఈ పరిణామంతో వైరస్ మరింత తీవ్ర ప్రమాదకారి అవుతుందని, దీనిని మొత్తంగా నివారించే క్రమంలో మరిన్ని సమస్యలు తలెత్తవచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హాంగ్జవులోని జెజియాంగ్ యూనివర్సిటీ ఆచార్యుడు లి లాంజువాన్ తన సహచరులతో కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మొత్తం 1,264 మంది బాధితుల్లో 11 మంది నుంచి సేకరించిన నమూనాల్ని పరిశీలించారు.