ప్రవాసాంధ్ర అధ్యాపకురాలు గౌరీ వేమూరి అమెరికాలోని ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించే ప్రవాస చిన్నారుల కోసం Quant-Q పేరిట ఓ గణితశాస్త్ర అభ్యాస పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని ఆమె అమెజాన్‌లో అమ్మకానికి ఉంచారు. కాగా దీని ప్రతులను గురువారం నాడు అందుకున్న గౌరీ అందులోని పాఠాలను చూసి ఉలిక్కిపడ్డారు. అమెజాన్ ద్వారా తనకు అందిన రెండు ప్రతుల్లో ఒకదానిలో తాను రూపొందించిన గణితశాస్త్ర పాఠాలు ఉండగా, రెండో దానిలో వర్జీనియాలో తుపాకీ నిబంధనలు, వాటి రకాలపై చిత్రాలతో సహా కథనాలు ఉండటం ఆమెను విస్మయపరిచింది. ఈ మేరకు ఆమె అమెజాన్‌ను సంప్రదించారు. రెండు పుస్తకాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియో పంచుకున్నారు. అది దిగువ చూడవచ్చు.
లెక్కల పుస్తకం ఆర్డరిస్తే తుపాకీ పాఠాలు వచ్చాయి
Related tags :