లాక్ డౌన్ నేపథ్యంలో పండ్లు కొనేవారులేక మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొంతమంది మామిడి రైతులు తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని తీర్మానించారు. మామిడి పండ్లను సోషల్ మీడియా ద్వారా వినియోగదారులకు అందుబాటు ధరకే అమ్ముతున్నారు. ఇందుకు, రమణరాంబాబు అనే యువరైతు నేతృత్వంలో ‘మ్యాంగో ఫార్మర్స్ సపోర్టర్స్’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను ప్రారంభించారు. ఇటువంటివి మొత్తం ఐదు గ్రూపులు క్రియేట్ చేశారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన పలు ప్రాంతాల వారిని సభ్యులుగా చేర్చారు. వీరి నుంచి ఆర్డర్ తీసుకొని, వారానికి రెండుసార్లు వినియోగదారులకు అందిస్తున్నారు. సేంద్రియ విధానంలో పండించిన బంగినపల్లి, పెద్దరసాలు అందుబాటులో ఉన్నాయి. కిలో నలభై రూపాయలు. కనీసం 15 కిలోలు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు 5 నుంచి 7 పికప్ పాయింట్లలో వినియోగదారులకు చేరవేస్తున్నారు. రోజుకు 250 నుంచి 300 ఆర్డర్లు వస్తుంటాయని నిర్వాహకులు చెప్పారు. వివరాలకు 8185815986 నంబరులో సంప్రదించవచ్చు.
సత్తుపల్లి మామిడిపళ్లకు వాట్సాప్ గ్రూపు
Related tags :