Kids

ఘనమైన చరిత్ర కలిగిన వేటపాలెం గ్రంథాలయం

Auto Draft

గొప్ప చరిత్ర కలిగిన వేటపాలెం గ్రంథాలయం చరిత్ర.. మీకు తెలుసా..?

“సారస్వత నికేతనం” ప్రకాశం జిల్లా వేటపాలెం లోని తెలుగు గ్రంథాలయం. ఈ గ్రంథాలయము అక్టోబరు 15, 1918లో వి.వి.శ్రేష్టి స్థాపించారు. స్వతంత్రం రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ కెల్లా ఇటువంటి అరుదైన ఏకైక గ్రంథాలయము ఇదే.

మహాదాత, గాంధేయుడు గోరంట్ల వెంకన్న గ్రంథాలయమునకు మొదటి దశలో భూరి విరాళము ఇచ్చాడు. ఈ గ్రంథాలయము ఆంధ్ర ప్రదేశ్లో పరిశోధన అవసరాలు తీర్చే గ్రంథాలయాలలో ప్రముఖమైనది. దీనిని 1929 లో మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935 లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించారు. దీని భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు.

ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ ఉంది. కొన్ని వార్తాపత్రికలు 1909 వ సంవత్సరమునుండి ఉన్నాయి. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బసచేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు.

సారస్వత నికేతనంలో ఎన్నో అపురూపమైన, అత్యంత అరుదైన పుస్తకాలు ఉన్నాయి. అలాగే తెలుగు సాహిత్య చరిత్రలో, చరిత్రరచనలో ఎన్నోవిధాలుగా ఉపకరించింది. ఇందుకు అసంఖ్యాకమైన ఉదాహరణలు ఉన్నాయి.

తెలుగులో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్ర గ్రంథాన్ని 1940 ప్రాంతాల్లో మూడవసంకలనం కూర్పుచేసి పునర్ముద్రించేందుకు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, పుస్తకప్రియుడు దిగవల్లి వేంకటశివరావు ప్రయత్నించగా వేటపాలెం గ్రంథాలయంలోనే మంచి ప్రతి దొరికి పునర్ముద్రణ సాధ్యమైంది.

*1918 అక్టోబరు 15 వి.వి. శ్రేష్ఠి F.A.R.U., హిందూ యువజన సంఘం గ్రంథాలయాన్ని స్థాపించారు.

*1924 ఒక పెంకుటిల్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రంథాలయాన్ని తరువాత ‘సారస్వత నికేతనం’ అని నామకరణం చేశారు. ఈ భవనాన్ని జమ్నాలాల్ బజాజ్ చే ప్రారంభించబడింది.

*1927 లో ఈ గ్రంథాలయం, 1927 సొసైటీ చట్టం క్రింద రిజిస్టరు కాబడింది.

*1929 క్రొత్త భవంతికి శంకుస్థాపన, మహాత్మా గాంధీ, చేసారు. తరువాత ఈ భవంతిని ప్రకాశం పంతులు ప్రారంభించారు.

*1930లో ఈ గ్రంథాలయం, జిల్లా కేంద్ర గ్రంథాలయంగా గుర్తింపు పొందినది.

*1935 బాబూ రాజేంద్ర ప్రసాద్, గ్రంథాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభాన్ని శంకుస్థాపన చేశారు. ఇదో జ్ఞానమందిరంగా అభివర్ణింపబడింది.

*1936 గాంధీగారు రెండో సారి విచ్చేశారు.

*1942 గుంటూరు జిల్లా గ్రంథాలయాల సభ జరిగింది.

*1943 అంతర్జాతీయ సహకార ఉద్యమం.

*1949లో 6వ దక్షిణ భారత యువత విద్యా సదస్సు జరిగింది.

*1950 జర్నలిజం కొరకు తరగతులు, వావిలాల గోపాలకృష్ణ ప్రధానాచార్యులుగా వ్యవహరించి, జరిపించారు.

*1985 RRLF, కలకత్తా వారిచే ఇవ్వబడిన మ్యాచింగ్-గ్రాంటు సహాయంతో, క్రొత్త వింగ్ ను ఏర్పాటు గావించారు.

*2018 వందేళ్ల పండుగ సందర్భంగా గ్రంథాలయ భవనం చిత్రంతో పోస్టల్‌ కవర్‌ విడుదల చేశారు