ఆమెని చూస్తే మన పక్కింటి అమ్మాయిని చూసినట్టే ఉంటుంది తప్ప గ్లామర్ హీరోయిన్ని చూసినట్టు ఉండదు. ఆమె ఎవరో కాదు నివేదా పెతురాజ్. మధురైలో పుట్టి దుబాయ్‌లో పెరిగిన నివేదా ఇప్పటివరకూ వెండితెర మీద సంప్రదాయబద్ధంగానే కనిపించింది. అలా కనిపించడంలో తన ప్రమేయం ఏమీ లేదనీ, గ్లామర్‌గా కనిపించడానికి తనకెలాంటి అభ్యంతరమూ లేదంటుంది నివేదా. గ్లామర్ పాత్రలకి ఓకే చెప్పినట్టేనా.. అని ఆమెకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎదురైనా ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు గ్లామర్‌గా కనిపించాల్సిన అవసరం రాలేదు. మొదటిసారి ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో గ్లామర్‌గా కనిపించాను. త్రివిక్రమ్‌గారు నా పాత్రను అలా డిజైన్ చేశారు. పాత్రకు ఎంత అవసరమో అంతవరకే గ్లామర్‌గా కనిపించాను. చెప్పాను కదా… అందాలు ఆరబోయకపోతేనో, గ్లామర్‌గా కనిపించకపోతేనో అవకాశాలు రావన్న భయం నాకు లేదు. తమిళంలో నేను చేసిన పాత్రలకు గ్లామర్ అవసరం రాలేదు. అందుకే తెరమీద గ్లామర్‌గా కనిపించాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. పాత్రకు అవసరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్లామర్‌గా కనిపిస్తాను..’’ అని నివేదా చెప్పుకొచ్చింది.
గ్లామర్ అవసరం రాలేదు

Related tags :