కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కోవడం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం… వంటి పరిణామాలతో మదుపరులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. పలు దేశాల్లో సమీప భవిష్యత్తులో లిక్విడిటీ సమస్యలు తలెత్తటంతో పాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ద్రవ్య లోటు ప్రధాన సమస్యలుగా మారబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే బంగారానికి అనూహ్యమైన గిరాకీ లభిస్తుంది. కాబట్టి ధర పెరిగి మదుపరులు లబ్ది పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపధ్యంలో వచ్చే ఏడాది కాలంలో బంగారం ధర తీరుతెన్నులపై వివిధ ఆర్థిక సేవల సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.
బంగారం భారీగా పెరగనుంది
Related tags :