ఒంగోలులో పేద అర్చకులకు నాట్స్ తన వంతు సాయం అందించింది. స్థానిక సంతపేట సాయిబాబా ఆలయంలో వందమంది పేదఅర్చకులకు ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. ఒక్కోక్కరికి పది కేజీల బియ్యం, రెండు కేజీల కందిపప్పు, 11 రకాల కూరగాయలను ఉచితంగా అందించారు. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తరపున స్థానిక పురోహితులు దక్షిణామూర్తి ఈ సాయాన్ని పేద అర్చకులకు అందించారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేద పురోహితులకు ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని దక్షిణామూర్తి అన్నారు. సామాజిక దూరం పాటిస్తూనే ఈ సాయం పంపిణి జరిగింది.
పేద అర్చకులకు నాట్స్ సాయం

Related tags :