Health

ప్లాస్మా థెరపీ బానే పనిచేస్తోంది-TNI కరోనా కథనాలు

Plasma Therapy Is Working Fine Says Kejriwal - TNILIVE Corona Bulletin

* కరోనా గతంలో నమోదైన క్లస్టర్ల నుంచే ఎక్కువగా కొత్త కేసులు వస్తున్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. గత 24 గంటల్లో ప్రస్తుతం ఉన్న క్లస్టర్లలోనే 40 కేసులు వచ్చాయన్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

* ఢిల్లీ ఎయిమ్స్‌లోని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలోని ఓ మేల్‌నర్స్‌(30)కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్యులు సహా 40 మంది సిబ్బంది సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. వైద్యాధికారులు వెంటనే వీరితోపాటు మేల్ నర్స్ పనిచేసిన వార్డులోని రోగుల శాంపిళ్లను కూడా సేకరించి పరీక్షలకు పంపారు. ఇప్పటి వరకు 22 మందికి సంబంధించిన ఫలితాలు రాగా, అవన్నీ నెగటివ్‌గా వచ్చాయని, మిగతా వారి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు వైద్యుడు ఒకరు తెలిపారు.

* తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. ముగ్గురు మహిళా సిబ్బందితో పాటు మొత్తం ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పోలీసు శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

* దేశ రాజధాని నగరంలో కరోనా రోగులకు నిర్వహించిన ప్లాస్మా థెరఫీతో సంతృప్తికరమైన ఫలితాలు వస్తున్నాయని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఇప్పటివరకు నలుగురు కరోనా రోగులపై ప్లాస్మా థెరఫీ క్లినికల్‌ ట్రైల్స్‌ నిర్వహించినట్టు చెప్పారు. వచ్చే రెండు మూడు రోజుల్లో వీటిని మరింతగా పెంచుతామన్నారు. అందువల్ల కరోనాతో పోరాడి కోలుకున్నవారు తమ ప్లాస్మాను దానం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

* దేశ రాజధాని నగరంలో కరోనా రోగులకు నిర్వహించిన ప్లాస్మా థెరఫీతో సంతృప్తికరమైన ఫలితాలు వస్తున్నాయని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఇప్పటివరకు నలుగురు కరోనా రోగులపై ప్లాస్మా థెరఫీ క్లినికల్‌ ట్రైల్స్‌ నిర్వహించినట్టు చెప్పారు. వచ్చే రెండు మూడు రోజుల్లో వీటిని మరింతగా పెంచుతామన్నారు. అందువల్ల కరోనాతో పోరాడి కోలుకున్నవారు తమ ప్లాస్మాను దానం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

* తెలంగాణాలో కరోనా వైరస్ వల్ల ఈ రోజు వరకు 25 మంది మృతి. ఈ రోజు నమోదయిన కేసులు 14. మొత్తం కరోన కేసులు 984.

* ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా మరో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 955కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 145 మంది డిశ్చార్జ్‌ కాగా, 29 మరణించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో 781 మంది చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో అనంపురం జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 27, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో నమోదైన కేసులో ఎక్కువ భాగం మూడు జిల్లాలోనే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 261, గుంటూరు జిల్లాలో 206, కృష్ణా జిల్లాలో 102 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

* భారత్‌లో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,684 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,077కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 4,749 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 37 మంది మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 718కి చేరింది. ప్రస్తుతం భారత్‌లో 17,610 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 6,430 కరోనా కేసులు నమోదు కాగా, 283 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్‌లో 2,624, ఢిల్లీలో 2,376, రాజస్తాన్‌లో 1,964, మధ్యప్రదేశ్‌లో 1,699, తమిళనాడులో 1,683, ఉత్తరప్రదేశ్‌లో 1,510 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

* Guntur News Update: Today Covid19 positive Cases= 11, Narasaraopet 7, Allurivaripalem 2,(near NRT) koppunuru 1, Gorantla 1.

* ముంబైలో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. మర్కజ్ సంఘటన వల్లే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. మూడవ విడత లాక్ డౌన్ పొడిగింపు మే 3న ఆ తర్వాతే నిర్ణయం. హెలిక్యాప్టర్ ఫండ్… ఇప్పట్లో లేదు, ఏదో ఓ రాష్ట్రం కోరితే ఇచ్చేది కాదు అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు కలిసితీసుకోవలసిన నిర్ణయం. ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ మాత్రమే ….ఆర్థిక ఎమర్జెన్సీ కాదు .

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 357 పాజిటివ్‌ కేసులు; 11 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు, ఈ ఒక్క రోజులోనే 122మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు ముంబయి మహానగరంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4589గా నమోదయ్యాయి. వీటిలో 595మంది కోలుకోగా.. 179మంది ప్రాణాలు కోల్పోయినట్టు బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.