Health

మీ కాలేయాన్ని కుళ్లబెట్టేది మీరే!

Take Special Care Of Your Liver-TNILIVE Health News

మ‌న శ‌రీరంలో లివ‌ర్ అత్యంత పెద్ద‌దైన అవ‌య‌వం. ఇది చేసే ప‌నులు ఎంతో ముఖ్య‌మైన‌వి. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాల‌న్నా, శ‌రీరానికి శ‌క్తి స‌రిగ్గా అందాల‌న్నా, విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లాల‌న్నా లివ‌ర్ ఎంతో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. అయితే నేటి త‌రుణంలో మ‌నం తింటున్న అనేక ఆహార ప‌దార్థాలు, ప‌లు వ్యాధులు, అల‌వాట్లు లివ‌ర్ చెడిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. చ‌క్కెర లేదా తీపి అధికంగా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయం దెబ్బ తింటుంది. చ‌క్కెరను అతిగా తింటే అది శ‌రీరానికి ఉప‌యోగం కాదు స‌రిక‌దా, అది మొత్తం లివ‌ర్‌లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీంతో కొంత కాలానికి లివ‌ర్ ప‌నితీరు మంద‌గించి అది చెడిపోతుంది.

2. నేటి త‌రుణంలో ఆహార ప‌దార్థాల‌ను రుచిగా అందించ‌డానికి వాటిలో మోనోసోడియం గ్లుట‌మేట్ అనే ప‌దార్థాన్ని ఎక్కువ‌గా క‌లుపుతున్నారు. దీంతో ఈ ప‌దార్థం ఉన్న ఆహారాన్ని తిన్న‌ప్పుడు అది మ‌న శ‌రీరంలోకి ఎక్కువ‌గా చేరుతోంది. దీని ప్రభావం ఎక్కువ‌గా ప‌డ‌డంతో లివ‌ర్ చెడిపోతోంది.

3. కూల్‌ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కూడా కాలేయం త్వరగా చెడి పోతుంది. కూల్‌ డ్రింక్స్ లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి.

4. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం వల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెలిసిందే.

5. ప్రాసెస్‌ చేసి ప్యాకింగ్‌ చేసిన చిప్స్‌ వంటి ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువగా తిన్నా వాటిలో ఉండే విష‌పూరిత‌మైన ప‌దార్థాలు లివ‌ర్ ఆరోగ్యంపై ప్ర‌భావాన్ని చూపుతాయి. కాబ‌ట్టి వాటికి కూడా దూరంగా ఉండ‌డం మంచిది.

6. అధిక బ‌రువు ఉన్న‌వారు కూడా లివ‌ర్ ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతే ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో లివ‌ర్ ఫెయిల్ అవుతుంది కూడా.

7. డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి లివ‌ర్ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం 50 శాతం వ‌ర‌కు ఉంటుంది.

8. క్రిమి సంహారక మందుల‌ను వాడి పండించిన కూర‌గాయ‌లు, పండ్ల‌ను తింటే వాటితో ఆ మందులు కూడా మ‌న శ‌రీరంలోకి వెళ్తాయి. అప్పుడు ఆ మందులు లివ‌ర్‌పై ప్రభావం చూపిస్తాయి. దీంతో లివ‌ర్ చెడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది.

9. మ‌ద్యపానం, ధూమపానం ఎక్కువగా చేసే వారిలో కూడా లివ‌ర్ త్వ‌ర‌గా చెడిపోతుంది.

What Alcohol Can Do To Your Liver - YouTube