అమెరికాలో నిరుద్యోగం క్రమంగా పెరిగిపోతోంది. కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ప్రతి ఆరుగురిలో ఒకరు తమ ఉపాధిని కోల్పోతున్నారు. 1930 మహా మాంద్యం నాటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నట్లు తాజాగా విడుదలైన ఉద్యోగ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1931-40 మధ్య కాలంలో నిరుద్యోగ రేటు 14 శాతానికి పైగా ఉండేది. గరిష్ఠంగా 25 శాతం కూడా నమోదైనట్లు లెక్కలున్నాయి. 2008-09 ఆర్థిక మాంద్యం సమయంలోనూ ఈ రేటు 10 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుత కొవిడ్-19 సంక్షోభంలో ఉద్యోగాలు ఇలాగే కోల్పోతుంటే, వచ్చే ఏడాదికి నిరుద్యోగ రేటు కచ్చితంగా 10% పైనే నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, గత వారంలో ఏకంగా 44 లక్షల మంది అమెరికన్లు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అమెరికాలో భయంకరంగా పెరిగిపోతున్న నిరుద్యోగుల సంఖ్య
Related tags :