వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన జులై 8న రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. వీరికి ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తామన్నారు. కరోనా లేకపోతే ఇప్పటికే ఇళ్లపట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేవని చెప్పారు. గత ప్రభుత్వం ఇవ్వని బోధనా రుసుములతోపాటు ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న మొత్తం బకాయిలను మంగళవారం విడుదల చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలల బోధనా రుసుములను నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. తమ పిల్లలు ఎలా చదువుతున్నారు? కళాశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించి తల్లులు ఫీజులు చెల్లిస్తారన్నారు. జవాబుదారీతనం కోసమే ఇలా చేస్తున్నామని సీఎం వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, మహిళా సంఘాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు.
27లక్షల మందికి జులై 8న
Related tags :