Politics

వాలంటీర్లపై విరుచుకుపడిన బాబు

Chandrababu Slams Volunteer System In AP via message from Telangana

రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లను నియమించింది ఆ పార్టీ నేతలకు దండాలు పెట్టడానికా?అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకే వాలంటీర్లను నియమించినట్లు ప్రభుత్వం పేర్కొందని.. ప్రజాధనంతోనే వారికి జీతాలు ఇస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. అలాంటప్పుడు కరోనా సాయం కింద ప్రభుత్వం అందించే రూ.1000 వైకాపా నేతలు ఇవ్వడం ఏంటని నిలదీశారు. కాదన్న వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం సరైన చర్యకాదని హితవు పలికారు. వాలంటీర్లు ఉన్నది ప్రజల కోసమా? పార్టీ కోసమా అని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీలను వైకాపా నేతల మాట వినలేదని విధుల్లోంచి తొలగించారని మండిపడ్డారు. వాటంటీర్లపై అలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.