ఆన్‌లైన్ వేదికగా మే 5న ఆరంభమయ్యే ఫిడే నేషన్స్ చెస్ కప్‌లో తెలుగు తేజాలు కోనేరు హంపి, పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక పాల్గొనబోతున్నారు. హంపి, హరికృష్ణ జట్టులో ఉండగా.. హారిక రిజర్వ్‌గా ఆడబోతోంది. వ్లాదిమిర్ క్రామ్నిక్ సలహాదారుగా వ్యవహరించబోతున్న భారత జట్టుకు మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ నాయకత్వం వహించనున్నాడు. విదిత్ గుజరాతి, అధిబన్ జట్టులో ఉన్నారు. చైనా, రష్యా, అమెరికాతో పాటు రెస్టాఫ్ వరల్డ్ జట్టు కూడా ఈ ఆన్‌లైన్ టోర్నీలో తలపడనుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ డింగ్ లీరెన్, వాంగ్ హో, హో యిఫాన్ లాంటి వారితో చైనా బలంగా ఉంది. రద్జబోవ్, మరియా ముజ్‌చుక్ క్రీడాకారులున్న రెస్టాఫ్ వరల్డ్ జట్టుకు ఫిడే అధ్యక్షుడు అర్కాడే కెప్టెన్‌గా ఉండడం విశేషం.