Movies

నక్సల్ మణి

Priyamani As Naxalite - Telugu Movie News

ప్రియమణి తెలుగుతెరపై కనిపించి చాలా కాలమైంది. వ్యాపారవేత్త ముస్తాఫారాజ్‌తో పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోందామె. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్‌ సరసన ‘నారప్ప’తో పాటు ‘విరాటపర్వం1992’లో నటిస్తోంది ప్రియమణి. నక్సలిజం, సామాజిక అంతరాల్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు వేణు ఊడుగుల ‘విరాటపర్వం’ సినిమాను రూపొందిస్తున్నారు. వాస్తవిక అంశాల స్ఫూర్తితో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నక్సలైట్‌గా తాను నటించబోతున్నట్లు ప్రియమణి తెలిపింది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు పూర్తి భిన్నమైన అనుభూతిని పంచే చిత్రమిదని చెప్పింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి నందితాదాస్‌ కీలక పాత్రను పోషిస్తున్నది.