Movies

ఆరోజుల్లోనే జాకెట్ లేకుండా…

The bold and beautiful veteran actress Archana

తెలుగులో ఎవరు చెయ్యలేని పాత్ర పోషించి సంచలం సృష్టించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..?

నటి అర్చన గురించి చెప్పాలంటే, నిరీక్షణ మూవీ చూడాల్సిందే. హావభావాలన్నీ మొహంలోనే పలికించగల నటి. తన నటనతో ఆడియన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేసింది. అందుకే ఈమె 1987లో వీరు మూవీ,1988లో దాసి మూవీతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు తెచ్చుకుంది. 1973లో ఈమె బాలనటిగా హిందీలో యాదం కి భారత్ అనే మూవీలో నటించింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా అదే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు. పెద్దయ్యాక లేడీస్ టైలర్, ఉక్కు సంకెళ్లు, మట్టి మనిషులు, భారత్ బంద్, దాసి, చక్రవ్యూహం, పచ్చతోరణం, పోలీస్ వెంకటస్వామి,వంటి సినిమాల్లో నటించింది.

తెలుగులో నటిస్తూనే తమిళ,మళయాళ భాషల్లో స్టార్ హీరోలతో నటించింది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. బాలు మహేంద్ర డైరెక్షన్ లో 1982లో వచ్చిన నిరీక్షణ మూవీలో పట్నం కుర్రాడిని ప్రేమించే గిరిజన యువతి పాత్రలో ఒదిగిపోయింది. ప్రేమించిన యువకునికోసం ఆమె పడే నిరీక్షణ జనానికి బాగా కనెక్ట్ అయింది. తాను ప్రేమించి ప్రియుడు ఓ తప్పుడు కేసులో ఇరుక్కుని జైలు పాలవుతాడు. అయితే తన ప్రియుని కోసం అర్చన పడే తపన ఈ మూవీలో సూపర్భ్. ఇప్పటి హీరోయిన్స్ మాదిరిగా గ్లామర్ కోసమో,ఎక్స్ పోజింగ్ కోసమో ఆమె నటించలేదు. సహజత్వానికి అనుగుణంగా నటించి మెప్పించింది.

అందులో భాగంగానే నిరీక్షణ సినిమా మొత్తం జాకెట్ లేకుండా చీర కొంగుని చుట్టుకుని అచ్చం గిరిజన యువతిలా కనిపించింది. హీరోయిన్ అంటే ఎక్స్ పోజింగ్ కి ,గ్లామర్ కి మాత్రమే పనికొస్తుందన్న భావననుంచి ఈమె మలుపు తిప్పింది. అందంతో కాకుండా నటనతో కట్టిపడేయవచ్చని చాటి చెప్పింది. ఇప్పటికీ నిరీక్షణ సినిమా చూస్తే అర్చన గురించి మాట్లాడుకోని ఆడియన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయింది. మళ్ళీ నిరీక్షణ లాంటి పాత్ర వస్తే తప్పకుండా రీ ఎంట్రీ ఇచ్చి నటిస్తానని ఇటీవల ఓ ఇంటర్యూలో ఆమె చెప్పింది.