విజయవాడలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. విజయవాడ నగరంలో రేపు చికెన్, మటన్, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్ మూసివేస్తున్నట్టు వీఎంసీ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
విజయవాడలో మాంసం విక్రయాలు బంద్
Related tags :