దాదాపు అన్ని ఇనార్గానిక్ ఆమ్లాలు ప్రమాదకరమైనవే. ఎందుకంటే వాటిని నిర్జీవ పదార్థాల నుంచి తయారు చేస్తారు. హైడ్రోక్లోరికామ్లం, సల్ఫ్యూరికామ్లం, నత్రికామ్లంలు ఈ కోవకు చెందినవే. ఆర్గానిక్ ఆమ్లాలైన ఎసిటికామ్లం, సిట్రికామ్లం వంటివి సహజంగా లభిస్తాయి. ఇవి బలహీనమైన ఆమ్లాలు.ప్రమాదకరమైన ఆమ్లం శరీర చర్మంపై పడగానే అది శరీర చర్మం దగ్గర ఉన్న కణాల్లోని నీటిని పీల్చుకుంటుంది. ఈ ప్రక్రియలో బోలెడంత ఉష్ణం విడుదల అవుతుంది. ఈ ఉష్ణం చర్మం దగ్గరున్న అనేక జీవకణాలను చంపేస్తుంది. దీంతో చర్మం కాలుతుంది.పరిశ్రమల్లో ఆమ్లాలతో పనిచేసే వారు ప్రత్యేకమైన దుస్తులు, మాస్కులు ధరిస్తారు. ప్రయోగశాలల్లో ఆమ్లాలతో ప్రయోగాలు చేసే విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొర పాటున ఆమ్లం చేతిపై పడితే ఆ ప్రదేశాన్ని నీటితో దాదాపు 5 నిమిషాలు కడుక్కోవాలి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని సోడా ద్రావణంతో కూడా కడుక్కోవాలి.
చర్మం-యాసిడ్ కథ
Related tags :