Agriculture

తెలంగాణాలో ఖరీఫ్ రబీలకు స్వస్తి

CM KCR Renames Khareef Rabi Season Names

పంట సీజన్లు ఖరీఫ్‌, రబీ పేర్లను వానాకాలం, యాసంగిగా మారుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, కార్పోరేషన్లు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు పంట సీజన్ల పేర్ల మార్పుపై సూచన చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై ఖరీఫ్‌, రబీ పదాలకు బదులుగా వ్యవసాయ సీజన్లు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వానాకాలం, యాసంగులుగా మారనున్నాయి. అంతేకాకుండా ఇకనుండి శాఖపరమైన ఉత్తర్వులు, పత్రాలలో వానాకాలం, యాసంగి పదాలనే వాడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సామాన్యులకే కాదు, చదువుకున్న వారికీ కూడా ఖరీఫ్, రబీ పదాలను వాడే విషయంలో గందరగోళం నెలకొంటున్న సంగతి విదితమే.