మటన్ లో బీఫ్ కలిపి అమ్మకాలు, హైదరాబాద్ లో దారుణం. అధికారుల తనిఖీల్లో సంచలన నిజాలు. మీరు మటన్ ప్రియులా. మటన్ బాగా తింటారా. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అని లాగించేస్తున్నారా. అయితే జర జాగ్రత్త. ఓసారి మటన్ కొనేముందు చెక్ చేసుకోండి. మీరు తింటున్నది మటనో కాదో తెలుసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు తింటున్నది మటన్ కాదు బీఫ్(గొడ్డు మాంసం). ఏంటి షాక్ అయ్యారా. కానీ ఇది నిజం. హైదరాబాద్ లో మటన్ పేరుతో జరుగుతున్న దందా వెలుగు చూసింది. పశుసంవర్థక శాఖ అధికారుల తనిఖీల్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. వ్యాపారులు మటన్(గొర్రె, మేక మాంసం) లో బీఫ్ కలిపి అమ్ముతున్న విషయం బహిర్గతమైంది. మటన్-బీఫ్ మిక్సింగ్ మాఫియా గుట్టురట్టయింది.
హైదరాబాద్‌లో మటన్-బీఫ్ మాఫియా
Related tags :