దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ తీవ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ప్రస్తుతం 16 ఉగ్ర స్థావరాలు యాక్టివ్‌గా ఉన్నాయని.. వాటిలో జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా తదితర నిషేధిత సంస్థలకు చెందిన దాదాపు 300 మందికిపైగా ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ ఆర్మీ సైతం వారికి అండగా నిలుస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో చొరబాట్లను కట్టడి చేసేందుకు భారత సైన్యం కూడా తనదైన వ్యూహాలను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. కరోనా నేపథ్యంలో గస్తీ నిర్వహించే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చొరబాటుదారులకు కరోనా ఉండే అవకాశాలు లేకపోలేవని తెలిపారు.
16 ఉగ్ర స్థావరాల్లో 350మంది కరోనా ఉగ్రవాదులు
Related tags :