Food

అరవతంబి అతి తెలివి. క్యారెట్ బీర్ విక్రయం.

Police arrest youth who made and sold carrot beer in Tamilnadu India

దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా వైన్‌ షాపులు మూతపడటంతో మద్యంప్రియులు అల్లాడుతున్నారు. ఆల్కహాల్‌ దొరకకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే సొంతంగా మద్యం తయారు చేసుకోవడానికి అనేక మార్గాలను అ‍న్వేషిస్తున్నారు. మద్యం దుకాణాలు మూసి వేసి ఉండడంతో సారా, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. యూట్యూబ్‌లో చూసి క్యారెట్‌ బీర్‌ను తయారు చేసి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముఖ్యంగా చెన్నైలో క్యారెట్‌తో బీర్‌ తయారు చేసి విక్రస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుచ్చినాంకుప్పం ప్రాంతంలో క్యారెట్‌ బీర్‌ తయారు చేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం ఆ ప్రాంతంలో గస్తీ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన సుకుమార్‌ (25) అనే వ్యక్తి క్యారెట్‌ బీర్‌ను తయారు చేసి విక్రయించినట్టు తెలిసింది. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచిన రెండు లీటర్ల క్యారెట్‌ బీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌ అనే రసాయ పౌడర్‌ను చేర్చి రెండు రోజులు ఊరించి తర్వాత దాన్ని తాగితే మత్తు ఏర్పడుతుందని యూట్యూబ్‌లో చూశానని , దాన్ని చూసి క్యారెట్‌ బీర్‌ తయారు చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపాడు.