క్యాబేజీ అంటే ముఖం ముడుచుకునేవాళ్లే ఎక్కువ. దాని వాసనో మరేమో గాని చాలామందికి క్యాబేజీ, కాలిఫ్లవర్‌లంటే ఇష్టం ఉండదు. కాని వారానికి ఒకసారైనా క్యాబేజీచ కాలిఫ్లవర్‌లను తప్పనిసరిగా తినమంటున్నారు పరిశోధకులు. వీటిలో ఉండే రసాయనాలు క్యాన్సర్ నివారిణులుగా పనిచేస్తాయంటున్నారు. క్యాబేజీ, కాలిఫ్లవర్‌లలో ఉండే ఐసోసయనేట్లకు క్యాన్సర్‌ను నిరోధించే సామర్థ్యం ఉందని ఇటీవలి పరిశోధనలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు మంచి మందుగా పనిచేస్తాయని ఈ అధ్యయనాల్లో తేలింది. దాదాపు 175 వేల మందికి పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆశ్చర్యకరంగా వీరిలో 15 శాతం పొగతాగనివాళ్లున్నారు. ఈ అధ్యయనంలో పొగతాగనివారిలో చేశారు. క్యాబేజీ తీసుకున్నవారికి శ్వాసకోశాల క్యాన్సర్ అవకాశాలు గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. వారానికి ఒకసారి వెజిటబుల్ సలాడ్‌లో సన్నగా తరిగిన క్యాబేజి ముక్కలను కూడా చేర్చి తీసుకుంటే మంచిది. ఎక్కువగా ఉడికిస్తే వీటిలోని యాంటి క్యాన్సర్ కారకాలు నశిస్తాయి. కాబట్టి క్యాబేజీ లేదా కాలిఫ్లవర్‌ను సలాడ్స్‌గా గాని, ఆవిరితో గాని ఉడికించి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
క్యాబేజీతో శ్వాసకోశ ఆరోగ్యం
Related tags :