Fashion

ఈ కొవ్వొత్తులకు మంట ఉండదు

ఈ కొవ్వొత్తులకు మంట ఉండదు-The candles without fire - Telugu fashion and lifestyle news

అచ్చం కొవ్వొత్తుల్లా కనిపిస్తూ వెలుగులు విరజిమ్మే ఎల్‌ఈడీ క్యాండిల్‌ లైట్లు మనకు పరిచయమే! వాటి మీద గణపతి, లక్ష్మి, సరస్వతి తదితర దేవతా రూపాలు కనువిందు చేసేలా ఎల్‌ఈడీ క్యాండిళ్లు తయారవుతున్నాయి. బ్యాటరీతో పనిచేసే వీటిని దేవుడింట్లోనో, హాల్లో టేబుల్‌ మీదో ఇలా ఎక్కడయినా పెట్టుకోవచ్చు. తెలుపు రంగులో మైనంతో చేసిన వాటిలా కనిపించే ఇవి మిణుకుమిణుకుమంటూ వెలుగుతూ నిజమైన కొవ్వొత్తిని తలపిస్తాయి. పిల్లలు ముట్టుకుంటారన్న భయం లేకుండా ఇంటిని దీపాలతో అందంగా అలంకరించుకునేందుకూ ఇవి ఎంతో బాగుంటాయి.