Business

చెరుకు రసం తాగమని ఒక్క హీరో చెప్పాడా?

The hypocrisy of Indian celebrities who chase money

చెరకు రసం, బత్తాయి రసం, కొబ్బరి నీళ్లు తాగండి అని టీవీ పేపర్ లలో ఒక్క హీరో అయినా చెప్పడు, ఎందుకంటే వాళ్లకు కోట్లలో ఇచ్చే అంత ఆ రైతులకు ఉండదు,

అదే దిక్కుమాలిన మన శరీరాలను సర్వనాశనం చేసే కూల్ డ్రింక్స్ ను మాత్రము తాగండి అని పదే పదే చెప్తారు. ఎందుకంటే ఆ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు హీరోలకు కోట్లల్లో డబ్బులు ఇస్తారు. కనుక వాళ్ళు ఏదైనా చెప్తారు.

ఎందుకంటే ఆ హీరోలకు డబ్బు ముఖ్యం. మనుషుల ప్రాణాలతో వాళ్లకు అవసరం ఉండదు, కానీ మనం.. హీరోలకు వాళ్ళ సినిమాలు వస్తే ఎగబడి చూస్తాము, వాళ్ళకోసం ఏమైనా చేస్తాము.

కానీ మరి మన రైతుల కోసం ఏంచేస్తున్నామో ఆలోచిస్తున్నారా?

రైతులకు మనం ప్రత్యేక సహాయం చేయకపోయినా పరోక్షంగా అయినా వాళ్ళు పండించిన ఆ పంట రైతుకు మనం సహాయం చేయచ్చు.

ఎలానో చెప్పాలా? మనం ఆ దిక్కుమాలిన కూల్ డ్రింక్స్ మానేసి ఈ బత్తాయి, చెరకు, కొబ్బరి రసాలు తాగండి, మనం రైతులకు సహాయం చేసినట్లే.

పాపం రైతు మన మధ్య ఉన్నా మనం పట్టించుకోము, కానీ ఎక్కడినుండో వచ్చిన కూల్ డ్రింక్స్ కంపెనీ లను మాత్రం బ్రతికిస్తాం.

ఇదెక్కడి న్యాయం చెప్పండి?

రసాల వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మన రైతు బాగుంటాడు.

కానీ కూల్ డ్రింక్స్ వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయి. అయినా మనం చెడు వైపే ఆలోచిస్తాము కానీ.. మంచివైపు ఆలోచిస్తామా..?

ఒకసారి ఆలోచించండి ప్లీజ్..

కరోనా లాక్ డౌన్ వల్ల ఆ హీరో ఉడ్చాడు, ఈ హీరో ఇంట్లో ఆ పని చేసాడు, ఆ హీరోయిన్ వంట చేస్తుంది అని పనికి రాని మెస్సేజ్ లు వాట్సాప్ ఫేస్బుక్ లలో పెడుతున్నారు ..

కానీ మొన్న వర్షానికి రైతులకు చాలా పంటలు దెబ్బతిన్నాయి, మామిడి కాయలు రాలిపోయాయి, అక్కడక్కడ కోతకు వచ్చిన వరి తడిసి ముద్ద అయింది. మరి ఇలాంటి పోస్టులు పెట్టడం రాదా జనాలకు..? చెప్పండి?

కరోనా వల్ల అన్ని కంపెనీలు మూతపడిన, వ్యాపారాలు ఆగిపోయినా..

ఒక రైతు పనులు మాత్రం ఎక్కడ ఆగిపోలే..!! రైతులు అలా ఆగిపోతే కరోనా మృతుల కంటే చాలా రేట్లు ఆకలి మరణాలు చూడాల్సి వస్తది..!!!

కావున రైతుకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ పంటలకు న్యాయం చేయాలి.

✊ మన రైతే మనకు యజమాని… !!! కాదంటారా..?