‘‘మహిళ చేయలేనిది అంటూ ఏమీ లేదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మరింత తెలివిగా వ్యవహరించాలి. మన మెదళ్లు ఆ సమయంలో మరింత చురుగ్గా పని చేయాలి’’ అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు. అమ్మాయిలను ఏడిపించే ఆకతాయిలు సమాజంలో మనకు తారసపడతారు. ఈవ్ టీజింగ్ ఘటనలు తారాస్థాయికి చేరిన సందర్భాలున్నాయి. ‘ఆకతాయిలు ఏడిపించినప్పుడు ఆత్మరక్షణకు నేనేం చేయాలి? చేతులతో పిడి గుద్దులు కురిపించాలా? మోకాలితో తన్నాలా?’ అని పాయల్‌ను ఓ అమ్మాయి సలహా అడిగారు. ‘‘ఎదుటివ్యక్తి దేహంలో దాడిని అనువైన, వెంటనే గాయపడే ప్రదేశాలు గుర్తు చేసుకోండి. కళ్లు, ముక్కు, గొంతు, మోకాళ్లు, ముఖ్యంగా అతడి ఆయువుపట్టు (సెంటర్ పాయింట్)… ఇలా! అక్కడ కొట్టండి’’ పాయల్ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ‘‘అవకాశం వస్తే కార్తికేయతో డేటింగ్ చేస్తారా?’ అని ఒకరు ప్రశ్నించగా… ‘‘నేను, కార్తికేయ మంచి స్నేహితులం. నాకది చాలు’’ అన్నారు. ‘వెంటనే తెలుగులో ఏ హీరోతో పని చేయాలనుకుంటున్నారు?’ అని అడగ్గా… ‘‘విజయ్ దేవరకొండ’’ అని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల ముంబయ్‌లో ఉంటున్న పాయల్, ఢిల్లీలోని తల్లిదండ్రులను మిస్ అవుతున్నాని తెలిపారు.
అలాంటి వెధవలను చెప్పుతో కొట్టండి
Related tags :