NRI-NRT

ఉపాధి హామీ కూలీలకు ఎన్నారై తెరాస విరాళం

Bahrain Telugu News - NRI TRS Bahrain Donates Masks To Daily Labor

తెరాస పార్టీ 20వ ఆవిర్భవోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నారై తెరాస సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఉపాధి కూలి హామీలకు మాస్క్ ల పంపిణీ. తెలంగాణ రాష్ట్ర సమితి 20వ వసంతం పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా జగిత్యాల జిల్లా,కథలాపూర్ మండలం, సిరికొండ గ్రామం ముద్దు బిడ్డ బహ్రెయిన్ ఎన్నారై టీఅర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ గారు మన గ్రామ ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలందరికి మాస్కులు ధరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలంనే ఉద్దేశంతో వారు మాకు ఉచితం గా తయారుచేపించి అందజేసిన మాస్కులను ఈరోజు మన గ్రామంలో కూలీలకు పంపిణి చేయడం జరిగింది.

ఎంపీటీసీ దొప్పల హైమావతి జలంధర్ మాట్లాడుతూ ఈ పండుగను ఎంతో సంతోషంగా ఉత్సవవాతావరణంలో జరుపుకోవాల్సింది. కానీ ఈ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో టిఆర్ఎస్ ఎంపీ శ్రీ. జోగినిపల్లి సంతోష్ కుమార్ వారి పిలుపు మేరకు.. మాస్కులను పంపిణి చేయడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఆరేళ్లలో అనేక అద్భుతాలు సాధించింది. సంక్షేమం, విద్యుత్, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాదించుకొన్నాము.ఇలాంటి ఉద్యమనాయకుడు మనకు దొరకడం అది మన అదృష్టం ఈరోజుల్లో ప్రజలు బాగుండాలని ఆలోచించే నాయకులూ లేరు బ్రతికుంటే బాల్చకు తినొచ్చు ,వేరే రాష్టాలనుడి వచ్చి ఇక్కడ పనిచేసుకున్న వారు కూడా మాబిడ్డలే అని గౌరవ కెసిఆర్ గారు చెప్పారు ఎవరుకూడా ఆకలితో ఉండకూడని ఆ బోళా శంకరుడు గౌరవ కెసిఆర్ గారు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం ఒక రేచాను కార్డుకు 1500 రూపాయలు ఇచ్చిన నాయకులూ దేశంలో లోనే లేరు. నాకు ఒక తండ్రితో సామానులు ఇలాంటి నాయకులూ మన తెలంగాణ కు సీఎం కావడం మన రాష్ట్ర ప్రజలు ఎంతో అదృష్టవంతులు.
ఈ కరోనా విపత్కర పరిస్థితులలో గ్రామ ప్రజలందరు బాగుండాలని.. మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మన రాష్ట్రంలో, మన దేశంలో కరోనా మహమ్మారి పీడ పోయి సాదారణ పరిస్థితులు ఏర్పడే వరకు మన సీఎం కెసిఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనకోసం మనం,
మాస్క్ ను ధరించి, లాక్ డౌన్ పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం! ఈకార్యక్రమములో గ్రామా సర్పంచ్ గాండ్ల వినస్వామి , ఎంపీటీసీ దొప్పల హైమావతి జలంధర్, సింగిల్ విండో చైర్మన్ దేవరజం , గ్రామా శాఖ తెరాస పార్తీ ప్రెసిడెంట్ రామాంజనేయులు , సింగిల్ విండో వైస్ చైర్మన్, వర్డ్ మెంబెర్స్ , రైతు సమన్వయ సభ్యులు,తెరాస నాయకులకు పాల్గొన్నారు.