కోవిడ్-19 మహమ్మారితో ప్రపంచం దాదాపు 3 మిలియన్ల (30 లక్షల మంది) సోకింది. ప్రపంచవ్యాప్తంగా 205,000 మంది మరణించిన విపత్కర సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ పై పోరులో భాగంగా వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. అంతా సవ్యంగా జరిగితే ఏడాదిలోపే కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీని మొదలు పెట్టనున్నామని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యులో తెలిపారు. లేదంటే దీనికి మందు కనుక్కోవడానికి రెండేళ్ళ లోపు సమయం పట్టవచ్చు అన్నారు. అయితే అంత సమయం పట్టక పోవచ్చుకానీ, వ్యాక్సిన్ ఉత్పత్తి సెప్టెంబరులో ప్రారంభం కాదని, ఇది తయారు కావడానికి కచ్చితంగా 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కనీసం రెండేళ్లు పడుతుంది
Related tags :