DailyDose

పాతిపెట్టిన శవానికి కరోనా పరీక్షలు-TNI బులెటిన్

Corona Tests On Buried Body-TNILIVE Corona Bulletin

* గుంటూరు జిల్లాలో ఈరోజు నమోదైన పాజిటివ్ కేసులు 22: నర్సరావుపేట 15, వినుకొండ సమీపంలోని కొండ్రముట్ల 1 , సంగడిగుంట 3 , ఆనందపేట 1 , కుమ్మరి బజార్ 1, యానాది కాలనీ 1.

* దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 28,380కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 886 మంది మరణించారని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొత్తగా 488 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది. మొత్తంగా 6,361 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం 21,132 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని హెల్త్‌బులెటిన్‌లో తెలిపింది.

* దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం జగన్‌ అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్‌డీ‌ఎల్‌ ల్యాబ్‌ కూడా లేదని.. ఇప్పుడు 9 ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 74,551 మందికి పరీక్షలు చేశామని సీఎం వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అంశాల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ సందేశమిచ్చారు.

* కరోనాతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న వేళ వైద్య నిర్వహణపై కేంద్రం నియమించిన సాధికార కమిటీ ఆశాజనకమైన నివేదికను వెల్లడించింది. వచ్చే నెల మే 16 నాటికి దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవచ్చని తెలిపింది. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలో నియమించిన ఈ కమిటీ మే 3వ తేదీ వరకు దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని తన నివేదికలో స్పష్టం చేసింది. మే 3-12 మధ్యలో రోజుకు సగటున వెయ్యికి పైగా కేసులు నమోదవుతాయని, ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాతని నివేదిలో పేర్కొంది. ఇప్పటి నుంచి మే 16 నాటికి 35 వేల కంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు కాకపోవచ్చని తెలిపింది.

* కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. వైరస్‌ పాజిటివ్‌ కేసులు 30 లక్షలకు చేరువకాగా 2 లక్షల 7వేల మంది మహమ్మారితో మృత్యువాతన పడ్డారు. కోవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 8.6 లక్షలకు పెరిగింది. ఇక అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 55,417కు చేరగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9.8 లక్షలకు ఎగబాకింది. బ్రిటన్‌లో ప్రాణాంతక వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 20,000 దాటింది.

* లాఠీలతో కొడితే చెడ్డ పేరు వస్తోంది…వాహనాలు సీజ్ చేస్తే నడుచుకొని తిరుగుతున్నారు… వదిలేద్దాం అంటే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి…వీటన్నిటికి కొత్త మందు కనిపెట్టారు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు.ఆదివారం నాడు రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఇక్కడే పాజిటివ్ నమోదయ్యాయి. దీంతో పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు రంగంలోకి దిగి గట్టి చర్యలు చేపట్టారు. సీపీ ఆదేశాల మేరకు డిసిపి విక్రాంత పాటిల్, ఏసీపీ నక్క సూర్యచంద్రరావు ప్రత్యేక బృందాలతో రోడ్డుపైకి వచ్చేశార. అనవసరంగా తిరుగుతూ రోడ్డుపైన దొరికిన వాళ్ళని అంబులెన్సు ఎక్కించి కోరంటిన్కు పంపుతున్నారు. ఫలితంగా కృష్ణలంక ప్రాంతం సోమవారం నాడు పూర్తిగా అదుపులోకి వచ్చింది. దీన్ని ఈలాగే కొనసాగిస్తామని సౌత్ ఏసిపి సూర్య చంద్ర రావు చెప్పారు.

* లాక్ డౌన్ పొడిగించడం సంగతి ఏమో కాని, రాష్ట్రాల మద్య వివాదాలు పెరిగేలా ఉన్నాయి. ఇప్పటికే కర్నాటక, కేరళ రాష్ట్రాల మద్య సరిహద్దు మూత వివాదం సుప్రింకోర్టు వరకు వెళ్లింది. తాజాగా తమిళనాడు అదికారులు చిత్తూరు జిల్లాలో సరిహద్దులను గోడలు కట్టి మూసివేయడం పెద్ద సమస్యగా మారింది. అలా చేయడం ఎంతవరకు సమంజసం అన్నది చర్చనీయాంశంగా ఉంది.వేలూరు జిల్లా కలెక్టర్ ఈ చర్య తీసుకున్నారు.దీనివల్ల అత్యవసర కేసులలో కూడా ఇబ్బందులు వస్తాయన్నది నిర్వివాదాంశం. మరో వైపు మహరాష్ట్ర మీదుగా డిల్లీ నుంచి బస్ లలో వచ్చిన వారి మూడు బస్ లను ఆదిలాబాద్ జిల్లా వద్ద ఆపివేశారు . డిల్లీలో క్వారంటైన్ పూర్తి చేసుకుని వీరంతా తిరిగి వస్తున్న సమయంలో తెలంగాణ హద్దులో ఆపేశారు. ఇలాంటి వాటిపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోతే ఈ గొడవలు తీవ్ర రూపందాల్చుతాయి. అంతేకాక ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతారు.గ్రామాలలో ముళ్లకంచెలు వేసుకున్నట్లు రాష్ట్రాల మద్య గోడలు కట్టవచ్చా!

* మల్కాన్‌గిరి జిల్లా ఖైర్‌పుట్‌ మండలం సింధిగుడా గ్రామానికి చెందిన దంపతులు కొన్ని నెలల క్రితం తెలంగాణలోని కరీంనగర్‌కు వలస వెళ్లారు. లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ పనులు లేకపోవడంతో కాంట్రాక్టర్‌ దగ్గర రూ.7వేలు తీసుకొని అందులోని రూ.5వేలుతో కొత్త సైకిల్‌ కొని స్వగ్రామానికి బయలుదేరారు. తొమ్మిదిరోజుల పాటు సుమారు 1000 కిలోమీటర్లు ప్రయాణించారు. శనివారం రాత్రి మల్కాన్‌గిరి జిల్లా గోవిందపల్లి వద్ద పోలీసులు వాళ్లను అడ్డుకొని క్వారంటైన్‌కు తరలించారు.

* లాక్‌డౌన్ సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మద్యం షాపుల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. దాదాపు 106 షాపుల్లో అవకతవకలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. సుమారు రూ.41 లక్షల విలువైన మద్యం మాయమైనట్లు గుర్తించారు. దీనికి సంబంధించి 58 మంది సిబ్బందిని అధికారులు తొలగించారు.

* చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో కలకలం. శ్మశానంలో పాతిపెట్టిన లారీ క్లీనర్ శవానికి తిరిగి కరోనా పరీక్షలు. మహారాష్ట్రలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన లారీ క్లీనర్. చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామ స్మశానం లో పాతి పెట్టిన వైనం. మహారాష్ట్ర నుండి రెడ్ జోన్ గా ప్రకటించిన ముప్పాళ్ళ గ్రామం దాటి ఒక లారీలో శవం తుర్లపాడు గ్రామానికి ఎలా వెళ్ళింది అని గ్రామంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఎటువంటి కరోనా పరీక్షలు నిర్వహించకుండా శవాన్ని పూడ్చి పెట్టడం ఏంటంటూ వెల్లువెత్తుతున్న అనుమానాలు.