నిత్యం రాజకీయాల్లో బిజీగా గడిపే మాజీ మంత్రి పరిటాల సునీత.. లాక్‌డౌన్ పరిస్థితులను ఆస్వాదిస్తున్నారు. కుటుంబసభ్యులతో గడపటంతోపాటు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు. పరిటాల కుటుంబానికి ముందు నుంచి వ్యవసాయ నేపథ్యం ఉన్నందున ఆమె అప్పుడప్పుడు పొలానికి వెళ్తుంటారు. గతంలో మంత్రిగా విధులు నిర్వహించిన సమయంలోనూ విత్తనం వేయటం, వరినాట్లు కోయడం వంటి పనులు చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా కాస్త సమయం దొరకడంతో వ్యవసాయ క్షేత్రంలో సాగులో ఉన్న బత్తాయ కాయలను కోస్తూ కనిపించారు. మాస్కు ధరించి కూలీలతో పాటు ఎంతో ఉత్సాహంగా బత్తాయ కాయలను కోశారు. వ్యవసాయ పనుల్లో పాల్గొనడం తనకు ముందు నుంచి అలవాటు ఉండేదని.. సమయం దొరికనప్పుడల్లా ఇలాంటి పనులు చేస్తుంటానని ఈ సందర్భంగా సునీత తెలిపారు.
బత్తాయి సాగులో బిజీగా పరిటాల సునీత
Related tags :