ఏపీ గవర్నర్ విశ్వభూషన్కు లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు కూడా చూసిచూడనట్లు వదిలేశారని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు లేఖలో వివరించారు. ఏకపక్షంగా జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరారు కన్నా లక్ష్మీనారాయణ. ఇటు ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన రాపిడ్ టెస్టింగ్ కిట్ల వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు కన్నా. చత్తీస్గఢ్ 350 రుపాయలకు కొనుగోలు చేస్తే.. అవే కిట్లను ఏపీ సర్కార్ 730కి కొనుగోలు చేసిందని తెలిపారు. అవి కూడా నేరుగా కొనుగోళ్లు జరపకుండా థర్డ్ పార్టీ ద్వారా కొనుగోలు చేశారని, దీని వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు. కిట్ల కొనుగోళ్లపై దర్యాప్తునకు ఆదేశించాలని గవర్నర్ను కోరారు కన్నా.
ఎన్నికలు వద్దు. రద్దే ముద్దు.
Related tags :