Movies

ప్రణతి…ప్రణతి…ప్రణీత

Praneetha Subhash Donated 75000 Meal Packets

ఆర్థికంగా సహాయం చేసిన ప్రణీత.. ఆ తర్వాత పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తాజాగా భోజనం తయారు చేసి ప్యాకెట్లలో సర్ది పేదలకు పంపిణీ చేస్తున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగి వంట చేయడం, వండిన పదార్థాలను ప్యాక్‌ చేసి పేదలకు అందిస్తున్నారు. అలా ఇప్పటివరకూ 75వేల పార్శిళ్లు పంపిణీ చేశారట. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ప్రణీత మంచి మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ప్రణీతలో అందంతో పాటు, అందమైన మనసు కూడా ఉందని ప్రశంసిస్తున్నారు.