DailyDose

లాక్‌డౌన్ తర్వాత పది పరీక్షలు ఉంటాయి-TNI కరోనా బులెటిన్

AP Will Conduct Tenth Exams After Lock Down-TNILIVE Corona Bulletin

* ఏపీలో లాక్ డౌన్ ముగిసిన తర్వాత టెన్త్ పరీక్షలు…భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి…రెండువారాలు గడువుఇచ్చి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం..త్వరలో పరీక్షలు షెడ్యూల్ విడుదల చేస్తాం.. – మంత్రి సురేష్

* ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో పని చేసే డైరెక్టర్ స్థాయి అధికారికి ‘కరోనా’ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సలహాదారు అలోక్ కుమార్ తెలిపారు. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు వైద్య పరీక్షల నివేదిక వెలువడ్డ అనంతరం తనకు ‘కరోనా’ పాజిటివ్ వచ్చిన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపారని అన్నారు. నిబంధనల మేరకు ఈ సమాచారాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలియజేశామని అలోక్ కుమార్ వివరించారు. ఆ అధికారితో కాంటాక్టులో ఉన్న ప్రతి ఒక్కరినీ హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ కార్యాలయంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని, 48 గంటల పాటు కార్యాలయన్ని మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు.

* ఏపీ రాజ్‌భవన్‌ సిబ్బంది నలుగురికి కరోనా మహమ్మారి సోకిందని రాష్ట్ర వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. గవర్నర్‌కు కూడా పరీక్షలు చేశామనీ.. ఆయనకు నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జిల్లా స్థాయిలో స్టాఫ్‌ నర్సులను రిక్రూట్‌ చేయాల్సి ఉంది. మొత్తం 9 వైరాలజీ ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు పెంచాం. ఎనిమిది జిల్లాల్లో వైరాలజీ ల్యాబ్‌లు ఉన్నాయి. మరో మూడు జిల్లాల్లో ల్యాబ్‌లు రానున్నాయి. మిగిలిన రెండు జిల్లాల్లోనూ త్వరలోనే ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం’’ అని వివరించారు.

* భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్‌ 19 బారిన పడినవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ రోజు సాయంత్రం 5గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 29,974 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 937మంది ప్రాణాలు కోల్పోగా.. 7027 మంది కోలుకున్నట్టు వెల్లడించింది.

* ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే 6 పాజిటివ్ కేసులురాష్ట్రలో 1009 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో25 మంది చనిపోయారుఇవాళ 42 మంది డిశ్చార్జిమొత్తం 374 మంది డిశ్చార్జిఅక్టీవ్ కేసుల 610

* కృష్ణాజిల్లా 13లో 12 బెజవాడ కేసులేకృష్ణ లంక – 6సింగ్ నగర్ – 1వైఎస్సార్ కాలనీ – 1చిట్టినగర్ – 1రామవరప్పడు – 1క్రీస్తు రాజపురం – 1భవానీ పురం – 1సూరం పల్లి – 1

* ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య ఇప్పటి వరకు 10 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం 2,380 కొత్త కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం 30,64,894 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 160 మంది మృతి చెందారు. మొత్తం ఇప్పటి వరకు 2,11,609 మంది మృ‌తిచెందారు.

* జిల్లాలోని గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఓ లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మూడు రోజుల క్రితం గోవాటి నుంచి సూరంపల్లి గ్రామానికి చేరుకున్నాడు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లగా…వైద్య సిబ్బంది అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో లారీ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్య అధికారులు వెల్లడించారు.

* బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంగళవారం ఉదయం అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడి స్టాక్ రికార్డులను అధికారుల బృందం పరిశీలించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పీయూష్ కుమార్, కార్తికేయ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఎక్సైజు శాఖ డిప్యూటీ కమిషనర్ మురళీధర్ తనిఖీలు చేపట్టారు.

* కరోనా లక్షణాల జాబితాలో కొత్తగా మరో ఆరు వచ్చి చేరాయి. అమెరికాలోని సెంటర్స్‌ ఆఫ్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) వీటిని జోడించింది. ఇప్పటిదాకా ఉన్న జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లక్షణాలకు తోడుగా… ఇప్పుడు రుచి, వాసనలకు గ్రహించలేకపోవడం, చలి పుట్టడం, చలితో వచ్చే వణుకుడు, తలనొప్పి, గొంతులో మంట, కండరాల నొప్పి వంటి ఇబ్బందులు కనిపించినా కరోనా సోకినట్లు అనుమానించాల్సిందేనని సీడీసీ చెప్పింది. కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించాక 2 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాలు బయటపడవచ్చునని తెలిపింది. ఛాతీలో విడవకుండా నొప్పి వస్తున్నా, గందరగోళంగా అనిపిస్తున్నా, పెదవులు కానీ, ముఖం కానీ నీలి రంగులోకి మారుతున్నా జాగ్రత్త పడాలని సీడీసీ హెచ్చరించింది. జాబితాలో పేర్కొన్న లక్షణాలే కాకుండా ఇతరత్రా మరేవైనా తీవ్ర ఇబ్బందులుంటే వైద్యులను సంప్రదించాలంది.

* దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,543 కరోనా కేసులు నమోదుకాగా, 62 మంది మృతిచెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,435కి చేరింది. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 934 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు మెడికోలు విద్యార్థులు దాదాపు 25 రోజుల క్రిందట రోడ్డు ప్రమాదంలో మరిణించిన విషయం విదితమే. వీరిని భారతదేశానికి తీసుకురావడం మేము గత 25 రోజులనుంచి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేడు మలేషియాలోని షిభు నగరం నుంచి మృతదేహాలను మనిలీలా విమానాశ్రయంకు తీసుకోవడం జరిగింది.