కరోనాతో కలిసి జీవించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు ఆందోళన కలిగించే అంశమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కరోనా వైరస్ కేవలం జ్వరం మాత్రమేనని తరచూ చెప్పే వ్యక్తిని ఏమనాలని ఆక్షేపించారు. జగన్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్.. దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఇక భగవంతుడే ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలన్నారు. ఈమేరకు జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ట్విటర్లో పోస్టు చేశారు.
చంద్రబాబుకు కోపమొచ్చింది

Related tags :