కరోనా వైరస్‌తో అతలాకుతలమైనా.. చైనా తమ సైనిక శక్తి ఆధునికీకరణను మాత్రం ఆపలేదు. తాజాగా మెషిన్ గన్‌తో కూడిన ఓ రోబో అసాల్ట్ వెహికల్‌ను రూపొందించింది. భవిష్యత్తులో సైనికుల స్థానంలో వీటిని వినియోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. శత్రుసేనలను ఎదుర్కోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అక్కడి సైన్యం భావిస్తోంది. ప్రస్తుతం ఇది చైనా ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)’ వద్ద ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు చైనా అధికారిక మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. ఇటీవల జరిపిన పరీక్షల్లో రోబో పనితీరు ఆమోదయోగ్యంగా ఉందని నిర్ధారించినట్లు తెలిపింది. అయితే దీనిపై ఉండే ఆయుధాలు మాత్రం సైనికుల నియంత్రణలోనే ఉండనున్నాయి.
ఈ వాహనంపై మెషిన్ గన్‌తో పాటు క్రేన్ వంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు మీడియాలో పేర్కొన్నారు. దీని వల్ల క్షిపణుల్ని లాంచ్ ప్యాడ్‌ల పైకి ఎక్కించడానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ పనిని భారీ క్రేన్లతో నిర్వహిస్తున్నారు. అయితే, వీటికి మనుషుల అవసరం మాత్రం తప్పనిసరి. తాజా రోబో వాహనం వల్ల సైనికుల అవసరం లేకుండానే వేగంగా, మరింత కచ్చితత్వంతో క్షిపణిని లాంఛ్ ప్యాడ్‌లోకి ఎక్కించే అవకాశం ఉంటుందని కథనంలో పేర్కొన్నారు. దీంట్లో అమర్చిన ప్రత్యేక సెన్సర్ల ద్వారా రాత్రి వేళల్లోనూ అత్యంత కచ్చితత్వంతో శత్రువుల్ని గుర్తించగలదని సమాచారం. దీన్ని రిమోట్‌తో నియంత్రించవచ్చు. లేదా ప్రోగ్రామింగ్ ద్వారా స్వయంగానూ నడవగలదని సైనికాధికారులు తెలిపారు. కొండలు, గుట్టల వంటి అసమతల ప్రదేశాల్లోనూ దీన్ని వినియోగించవచ్చునని వెల్లడించారు.
వైరస్ అయిపోయింది. ఇప్పుడు చైనీస్ రోబో సైనికులు.
Related tags :