కరోనా మహమ్మారితో పోరాడేందుకు తన వంతు సాయంగా తొలివిడత కింద రూ.100 కోట్లను ఖర్చు చేయనున్నట్లు కోకకోలా ప్రకటించింది. ఈ నిధులను ఆరోగ్య సంరక్షణ సేవలకు, పేద ప్రజల సాయానికి వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే 10 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో పానీయాలను కూడా సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ, ఆహార సదుపాయాల నిమిత్తం పలు చర్యలు చేపట్టేందుకు యునైటెడ్ వే, కేర్ ఇండియాతో కలిసి పనిచేయనున్నామని తెలిపింది.
₹100కోట్లు ఇచ్చిన కోకాకోలా
Related tags :