కరోనాపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది సేవల్ని స్మరిస్తూ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి నిర్మించిన ఈ గీతాన్ని ప్రగతిభవన్‌లో ఆయన ఆవిష్కరించారు. కరోనాపై అవగాహన గీతాన్ని కందికొండ రాయగా.. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ గీతం ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పిస్తుందని కేటీఆర్ అన్నారు.
కరోనా గీతాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
Related tags :