కరోనాను కట్టడి చేసేందుకు నెలరోజుల నుంచి దేశంలో లాక్‌డౌన్ ప్రకటించటంతో అసాధ్యమనుకున్న పనులు కూడా కొన్ని వాటంతట అవే జరుగుతున్నాయి. దేశంలో అత్యధిక జనాభాకు జీవనాధారమైన గంగానదిని శుద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. శుద్ధి కోసం వేలకోట్లు ఖర్చు చేసింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వంలో ఓ మంత్రినే నియమించింది. అయినా పెద్దగా ఫలితం కన్పించలేదు. కానీ నెలరోజుల లాక్‌డౌన్‌తో గంగ మళ్లీ పవిత్రమైంది.
లాక్‌డౌన్ కారణంగా గంగానది వెంట ఉన్న కంపెనీలన్నీ మూత పడటంతో వాటి వ్యర్థాలు నదిలోకి చేరటంలేదు. ప్రజలు కూడా ఇండ్లనుంచి బయటకు రావటంలేదు కాబట్టి ఇతర వ్యర్థాలు కూడా నదిలోకి రావటంలేదు. దాంతో నదిలో నీరు స్వచ్ఛంగా కనిపిస్తున్నదని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అధికారులు అంటున్నారు. నీటిలో కాలుష్య స్థాయిని తెలుసుకొనేందుకు మార్చి 24న సేకరించిన నమూనాలతో పోల్చితే ఏప్రిల్ 20న సేకరించిన నమూనాల్లో ఏకంగా కాలుష్యం 30శాతం తగ్గిందని బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన మహామన మాలవీయ రిసెర్చ్ సెంటర్ ఫర్ గంగ చైర్మన్ బీడీ త్రిపాఠి తెలిపారు.
వేల కోట్లు చేయలేకపోయాయి. లాక్‌డౌన్ చేసింది.
Related tags :