తెలంగాణా ఎన్నారై ఫోరం (TeNF) తెలంగాణా రాష్ట్రంలో కరోనాపై పోరులో తనవంతు సాయంగా ఆర్థిక శాఖా మంత్రి టీ.హరీశ్‌రావుకు ₹లక్ష చెక్కును నేడు అందజేసింది. మరింత విస్తృతంగా కరోనాపై పోరాడేందుకు సహకరిస్తామని సంస్థ అధ్యక్షులు ప్రమోద్ గౌడ్ ,ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ ,ఫౌండర్ వేణుగోపాల్ ,ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి ,రంగు వెంకట్ ,మహేష్ జమ్మలలు తెలిపారు. లండన్‌లో 150మంది తెలుగు విద్యార్థులకు నిత్యావసర సరుకులను కూడా తమ సంస్థ ద్వారా అందజేశామని, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నామని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ,టీడీఫ్,తాల్ ,యుక్త ,జాగృతి ,వాసవి క్లబ్ ,హైదరాబాద్ బావార్చి ,ఒయాసిస్ అకౌంట్స్ ,తుకారాం రెడ్డి ,ఉదయ్ నాగరాజు,గోలి తిరుపతి,ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అధికారి కందుల రవీంద్రరెడ్డి తదితరులు సహకరించారు.
కరోనా విపత్తు సహాయంగా ₹లక్ష అందించిన TeNF
Related tags :