Fashion

నాట్యం…ఆరోగ్యం….అందం

Dance And Health Benefits - Telugu Fashion & Lifestyle

డ్యాన్స్ చేయడం వల్ల శరీరం, మనసు కూడా ఎంతో రిలాక్స్ అవుతుంది. నేటి బిజీ తరుణంలో ప్రతీఒక్కరూ ఏదో ఓ ఒత్తిడి ఎదుర్కొంటూనే ఉంటారు. అలాంటివారు డ్యాన్స్ చేయడం వల్ల ఎన్నో లాభాలుంటాయని చెబుతున్నాయి పరిశోధనలు.. డ్యాన్ అంటే కేవలం సినిమాకే సంబంధించిన విషయం కానే కాదు.. అది కళ.. అంతకుమించిన వ్యాయామం.. బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. చాలామంది ఏదో పండుగకో.. పబ్బానికో.. ఆనందంగా ఉన్నప్పుడు చేస్తారు.. కానీ నిజానికి ఆనందంగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేయడం కాదు.. డ్యాన్స్ చేస్తే ఆనందంగా ఉంటారనేది నిజం. అవును.. డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని ప్రతి అవయవం, కండరం కదులుతాయి.. వ్యాయామానికి బద్దకించే బాడీ కాస్తా.. కొత్త ఉత్సాహంతో గంతులేస్తుంది.. ఈ కారణంగా శరీరంలోని ఎన్నో కేలరీలు ఖర్చు అవుతాయి. ఫలితంగా బరువు తగ్గడం.. బిగుసుకున్న కండరాలు రిలాక్స్ అవ్వడం.. మనసు ప్రశాంతంగా మారుతుంటుంది.. అంతేకాదు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలను అదుపు చేయడంలో డ్యాన్స్ ముందుంటుంది. రోజూ తప్పకుండా ఏదో వ్యాయామం చేయాలనుకున్నవారిలో చాలామంది డ్యాన్స్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చాలా పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల ఏదో వర్కవుట్ చేసినట్లు కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. జుంబా, ఏరోబిక్స్ ఇలా ఏదైనా సరే డ్యాన్స్‌తోనే ముడిపడి ఉంటుంది. మ్యూజిక్‌ వినడం, దానికి తగ్గట్లు బాడీని కదిలించడం.. అన్ని కూడా రిలాక్స్ చేసే పనులే.. ఇలా చేయడం వల్ల చక్కని వ్యాయామం చేసినట్లే.. ఆ కారణంగా ఆరోగ్యం మీ సొంతమైనట్లే.. కండరాలు, ఎముకలను బలంగా చేయడం, బాడీని ఫిట్‌గా ఉంచడం, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం డ్యాన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కాబట్టి.. డ్యాన్స్ అంటే మనకి సంబంధించినది కాదు అని అనుకోకుండా.. వ్యాయామం అంటే ఇష్టపడని వారంతా చక్కగా చేసేయొచ్చు. అయితే.. చేయడానికి ముందు మంచి ఫుడ్ తీసుకోవడం, వార్మప్ చేయడం వంటివాటిని నిర్లక్ష్యం చేయొద్దు.