ఒమన్ దేశం మస్కట్ లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ ఆధ్వర్యంలో తెరాస 20వ వార్షికోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న కరోన విపత్తు కారణంగా కేటీఆర్, ఎన్నారై తెరాస సమన్వయకర్త బిగాల మహేశ్ సలహా మేరకు సామాజిక దూరం పాటిస్తూ ఈ వేడుకలను నిర్వహించారు. మస్కట్ లోని అంసబ్ లో ఉపాధ్యక్షుడు షేక్ అహ్మద్ నివాసంలో టీఅర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి అమరవీరులకు ఘననివాళి అర్పించి ఆవిర్భావ దినోత్సవలు సాధారణంగా నిర్వహించారు. అనంతరం అక్కడ ఈ విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న దినసరి కార్మికులకు సరిపడ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒమాన్ ఇండియన్ సోషల్ క్లబ్ జనరల్ సెక్రెటరీ హైదరాబాద్ వాస్తవ్యులు సోహెల్ ఖాన్ ఆధ్వర్యంలో గత నెలరోజులుగా ఒమాన్ లో కరోనా వల్ల చిక్కుకున్న భారతీయులకు నిత్యావసర సరుకులను అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ సభ్యులు షేక్ అహ్మద్,సాయి కుమార్ చౌదరి,యూనిస్, మధు,వీరేందర్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఒమన్ లో ఇప్పటి వరకు మొత్తం 2,131 కరోన పాసిటీవ్ కేసులు నమోదు కాగా 364 మంది రికవరి అయ్యారు మరియు 10 మంది చనిపోయారు అని మహిపల్ తెలిపారు.
ఒమన్‌లో తెరాస ఆవిర్భావ దినోత్సవం
Related tags :