‘స్టే హోం. స్టే సేఫ్’ మాత్రమే కాదు. ‘స్టే సైబర్ సేఫ్’ నినాదమూ ముఖ్యమే. లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటూ.. ‘శారీ ఛాలెంజ్’ విసురుతున్న మహిళలూ తస్మాత్ జాగ్రత్త …అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. చీర ఛాలెంజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఒకరికొకరు ఛాలెంజ్ విసరడం వల్ల సోషల్‌మీడియాలో విపరీతంగా ఫొటోలు అప్‌లోడ్ అవుతున్నాయి. చీరకట్టును చూసి మురిసిపోవడం పక్కన పెడితే, కొన్ని బూతు సైట్లకు వాటిని మార్ఫింగ్ చేయడానికి ఆస్కారం ఇచ్చినట్లు అవుతున్నది. శారీ ఛాలెంజ్ అనేది సరదా కోసమే కావచ్చు కానీ.. అప్‌లోడ్ చేసే ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ నగ్న చిత్రాలుగా మారుస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అవి ఒరిజినల్సే అన్నట్టుగా ఉంటాయి. జనరేటర్.. డిస్క్రిమినేటర్ వంటి ఆల్గారిథమ్స్ ఆధారంగా చీరకట్టుకున్నా.. నగ్నంగా ఉన్నట్టు చూపించే వీడియోలు రూపొందించడం అసాధ్యమేం కాదు. వీటిని అశ్లీల వెబ్‌సైట్లలో పెట్టి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇలాంటి ఛాలెంజ్‌లలో పాల్గొనేటప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలి.
శారీ ఛాలెంజ్‌లో పాల్గొన్న లేడీస్ ఇది చదవాలి
Related tags :