Politics

ఏపీలో మీ ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు

Andhra COVID19 Lock Down Restrictions Flexed

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే కరోనా పరీక్షలు చేసిన తర్వాతే వారిని స్వస్థలాలకు పంపుతామని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఏపీకి చెందినవారు ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినట్లయితే వారు కంట్రోల్‌ రూం నంబర్‌ 0866-2424680 లేదా apcovid19controlroom@gmail.com ద్వారా సంప్రదించాలని కృష్ణబాబు విజ్ఞప్తి చేశారు.