దక్షిణాసియాలో పుట్టిన క్యారమ్ ఈ దేశాల్లోని పలు ఇళ్లల్లో వేసవి సెలవుల్లో ఆడుతుండడం కనిపిస్తుంది. మనదేశంలో అయితే పిల్లలేకాదు..పెద్దలు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఆటపట్ల మక్కువ చూపుతారు. అయితే చాలామంది క్యారమ్స్ ఆటను ఆసక్తిగా ఆడతారే తప్ప..దాని నియమ నిబంధనలు పెద్దగా తెలియవు. కానీ వాటిని తెలుసుకొని ఆడితే ఆ ఆటలో ఉండే మజానే వేరు. ఇక కరోనా వైరస్‌తో నెల రోజులుగా దేశం లాక్‌డౌన్‌లో ఉండడంతో పిన్నలు, పెద్దలేకాదు..వృద్ధులు సైతం క్యారమ్ ఆటకు సై అంటున్నారు. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న క్యారమ్ బోర్డుల విక్రయాలే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో ఆ ఆటకు సంబంధించి నియమ, నిబంధనలు..
****బోర్డు ఏర్పాటు..
సాధారణంగా క్యారమ్ బోర్డును భూమిపైన 23 నుంచి 28 అంగుళాల ఎత్తులో స్టాండ్‌పై ఏర్పాటు చేసుకోవాలి.
* బోర్డు నాలుగు మూలలా వృత్తాకారంలో నాలుగు రంధ్రాలుండి కాయిన్లు కింద పడిపోకుండా వాటికింద నెట్ ఉంటుంది.
* బోర్డు మధ్యలో ఒక పెద్ద, ఒక చిన్న సర్కిల్ ఉంటాయి. గేమ్ ప్రారంభానికి ముందు కాయిన్లను ఈ రెండు సర్కిళ్ల మధ్యన ఏర్పాటు చేయాలి. బోర్డుకు నాలుగువైపులా దీర్ఘ చతురస్రాకారంలో రెండు లైన్లు ఉంటాయి. స్ట్రయికర్‌ను ఈ లైన్ మధ్యలో ఉంచి షూట్ చేయాల్సి ఉంటుంది.
*క్యారమ్ కాయిన్లు : తొమ్మిది నల్ల కాయిన్లు, తొమ్మిది తెల్ల కాయిన్లు, ఒక ఎర్ర కాయిన్ (దీన్ని క్వీన్ అని పిలుస్తారు).
* ఒక్కో రౌండ్‌లో నల్లని, తెల్లని కాయిన్లను స్ట్రయికర్‌తో పడగొట్టాల్సి ఉంటుంది.
* మొదటి కాయిన్‌ను పడగొట్టిన తర్వాత ఎప్పుడైనా ఎర్ర కాయిన్‌ను పడగొట్టవచ్చు.
*బోర్డుపై కాయిన్ల ఏర్పాటు : క్వీన్ కాయిన్‌ను బోర్డు మధ్యలో ఉంచాలి. దీని చుట్టూ సర్కిల్ మధ్యలో ఆరు కాయిన్లను ఏర్పాటు చేయాలి. ఈ కాయిన్లు ఒక్కొక్కటీ క్వీన్‌ను, దానికి ఆనుకుని ఉన్న కాయిన్లను తాకాలి.
* మిగిలిన 12 కాయిన్లను ఇన్నర్ సర్కిల్‌లోని ఆరు కాయిన్లకు అనుబంధంగా ఏర్పాటు చేయాలి. వెలుపల ఏర్పాటు చేసే కాయిన్లు కచ్చితంగా ఇన్నర్ సర్కిల్‌ను ఆనుకునే ఉండాలి. ఒక నల్ల కాయిన్ తర్వాత తెల్ల కాయిన్..ఇలా ఏర్పాటు చేసుకోవాలి. దీర్ఘ చతురస్రాకార లైన్ మధ్య స్ట్రయికర్‌ను ఉంచాలి.
*ఆట ప్రారంభం ఇలా: సింగిల్స్‌లో అయి తే ఇద్దరు ఆటగాళ్లు ఒకరి ఎదురుగా మరొక రు కూర్చోవాలి. టీమ్ గేమ్‌లో అయినా ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఎదురెదురుగానే ఉండాలి. తొలిసారి ఎవరు స్ట్రయిక్ చేస్తారనేది టాస్ ద్వారా నిర్ణయిస్తారు. టాస్ గెలిచిన ఆటగాడు తెల్లటి కాయిన్లను కొట్టాల్సి ఉంటుంది. సాధారణంగా స్ట్రెయిట్ గ్రిప్‌తో కాయిన్స్‌ను కొడతారు. ఒకవేళ స్ట్రయికర్ కొత్త అయితే.. అరచేతిని ఒకింత బోర్డుపైకి వంచి చూపుడు వేలితో స్ట్రయికింగ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రయికర్‌ను ‘ఫ్లిక్’ చేయాలే తప్ప తోయకూడదు. ఫార్వర్డ్ షాట్లకు చూపుడు వేలు ఉపయోగించాలి. బ్యాక్ షాట్లకు బొటన వేలిని ఉపయోగించాలి. షాట్ కొడుతున్నప్పుడు దీర్ఘచతురస్రాకార లైన్‌ను చేయి దాటకూడదు. అలాగే ముంజేతులను బోర్డుపైన ఉంచకూడదు. ఇలా చేస్తే పౌల్ అవుతుంది.
***పాయింట్లు
ఏ రంగు కాయిన్‌కు అయినా ఒక పాయింట్ ఇస్తారు.
* ఎరుపు రంగు లేదా క్వీన్‌కు మాత్రం మూడు లేదా ఐదు పాయింట్లు
* క్వీన్‌ను స్ట్రయిక్ చేయాలంటే ఆటగాడు తొలుత ఒక కాయిన్‌ను పడగొట్టి ఉండాలి. అలాగే క్వీన్ కాయిన్ పడగొట్టాక కూడా మరో కాయిన్‌ను కూడా పడగొట్టాలి. అలాకాకపోతే క్వీన్‌ను మళ్లీ బోర్డులో ఉంచుతారు.
* క్వీన్‌ను కవర్ చేశాక ఏ ఆటగాడైతే బోర్డుపై మిగిలిన తన కాయిన్స్‌ను క్లియర్ చేస్తాడో అతడు గేమ్ గెలుస్తాడు.
* ఇలా ఆడుతూ…ఎవరైతే ముందుగా 29 పాయింట్లు సాధిస్తారో…అతడు గెలిచినట్టు లెక్క.
**ఫౌల్
మీరు ఫౌల్ చేస్తే పెనాల్టీకింద మీ రంగు కాయిన్ ఒకదాన్ని బోర్డుపై పెట్టాలి. అది ఎప్పుడంటే…
* స్ట్రయికర్‌ను పాకెట్‌లో వేసినా…
* స్ట్రయికర్ లేదా ఏదేనీ కాయిన్‌ని బోర్డు బయటికి కొట్టినా..
* ప్రత్యర్థి కాయిన్‌ని పాకెట్‌లో వేసినా…
* రెడ్ కాయిన్ వేయకుండా..మీ రంగుది ఆఖరి కాయిన్‌ను పాకెట్‌లో వేస్తే వేసిన కాయిన్‌తోపాటు మరోటి పెనాల్టీ కట్టాలి. ఠ ప్రత్యర్థిది చివరి కాయిన్ మాత్రమే బోర్డుపై ఉన్నప్పుడు రెడ్ వేసిన మీరు తర్వాత పొరపాటున ప్రత్యర్ధి కాయిన్ వేస్తే ఆ గేమ్‌లో మీ ప్రత్యర్థి గెలిచినట్టే.
లాక్‌డౌన్ స్పెషల్ స్కిల్‌గేమ్స్ – క్యారమ్స్
Related tags :