లాక్‌డౌన్ ప్రకటించి అప్పుడే నెలరోజులు గడిచింది. పర్యాటక రంగానికి రూ. 400 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేశారు. సాధారణంగా ప్రతీ నెలా ఈ రంగం ద్వారా రూ.400 కోట్ల ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్ కారణంగా అన్నిటినీ మూసేయడంతో పర్యాటకుల జాడ కనిపించడంలేదని తెలిపారు. నగరంలోని హోటళ్లపై ఆధారపడి సుమారు 30 వేల మంది జీవనం సాగిస్తున్నారని, ఇప్పుడు వారంతా నిరుద్యోగులుగా మారారని పేర్కొన్నారు. టాంగాలు, జట్కాలు, సారోట్‌లు, వీధి వ్యాపారాల ద్వారా నెలకు రూ.100 కోట్ల మేర వ్యాపారాలు నమోదయ్యేవని అంచనా. ప్రస్తుతం అవన్నీ నిలిచిపోయాయన్నారు. ఎప్పుడు లాక్‌డౌన్ తొలగిపోతుందోననే ఆశతో ఈ రంగానికి చెందిన ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆతిథ్య (హోటల్) రంగమే రూ.200 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆ సంఘం అధ్యక్షుడు నారాయణగౌడ పేర్కొన్నారు.
₹400కోట్లు హుష్‌కాకి
Related tags :