టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రంలో అఘోరా పాత్రలో కనిపించనున్నారని దర్శకుడు బోయపాటి శ్రీను అధికారికంగా వెల్లడించారు. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలతో బాలకృష్ణను మాస్ అభిమానులకు బోయపాటి శ్రీను మరింత దగ్గర చేశారు. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన ఈసినిమా షూటింగ్‌ను కరోనా కారణంగా కొంతకాలం పాటు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర గురించి గత కొంత కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నారంటూ సినీ ప్రియులు అనుకుంటున్నారు.
అఘోరాగా బాలయ్య
Related tags :