Politics

కరోనా మృత్యుభయం వద్దు

TG Health Minister Eetela Rajendar Speaks Of Corona Updates

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలును సమాజంలోని అన్ని వర్గాలూ ప్రశంసించాయని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా కేసులు, మరణాలు దాస్తే దాగేవి కాదన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే కింగ్‌ కోఠి ఆస్పత్రికి రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా వస్తే చనిపోతామన్న ఆందోళన ఎవరికీ వద్దన్నారు. తెలంగాణలో కొత్తగా ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1044కి చేరింది. కరోనా నుంచి కోలుకొని ఈ రోజు 24మంది డిశ్చార్జి అయ్యారు.