ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధికన్నా ఎక్కువ భయపెడుతున్న వ్యాధి డయాబెటిక్. మారిన జీవన విధానం కారణంగా డయాబెటిక్ రోగుల సంఖ్య ఏటేటా కోట్లలో పెరుగుతున్నది. ఈ వ్యాధి ఉన్నవారు శరీరంలో షుగర్ స్థాయిలు ఎలా ఉన్నాయో తరుచూ పరీక్షించుకొంటూ ఉండాలి. ఈ పరీక్షలు ఇప్పటివరకు రక్తం ద్వారా చేసేవారు. ఇక ఆ తిప్పలు ఉండదని అంటున్నారు దక్షిణకొరియా పరిశోధకులు. ఆ దేశంలోని పొహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు కంట్లో వాడే లెన్స్‌ను వినూత్నంగా రూపొందించారు. డయాబెటిక్ రోగులు అవి ధరిస్తే చాలు ఎప్పటికప్పుడు శరీంలోని షుగర్ స్థాయిలను అవి మానిటర్ చేసి చెపుతాయి. వైర్‌లెస్ టెక్నాలజీతో పనిచేసే ఈ లెన్స్ షుగర్ స్థాయిలను అంచనావేసి ఎప్పుడు మెడిసిన్ అవసరమవుతుంది, దవాఖానకు వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా సూచిస్తాయి. భవిష్యత్తులో కంటి ద్వారానే మెడిసిన్ కూడా తీసుకొనేందుకు ఈ లెన్స్ ఉపయోగపడుతాయని ఈ లెన్స్ రూపకల్పనకు నేతృత్వం వహించిన డొహి కెయుమ్ తెలిపారు. కంటిలో ఉండే బ్లడ్ లిడ్స్‌ను పరీక్షించటం ద్వారా ఇవి పనిచేస్తాయని వెల్లడించారు. ఈ లెన్స్ నిరంతరం గ్లూకోజ్ ను పరిశీలించటమే కాకుండా రెటినోపతి ద్వారా చికిత్స కూడా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ లెన్స్ చిప్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది.
మధుమేహులకు సూది గోల తప్పింది
Related tags :