స్నాప్‌డీల్ సహా మరో ఇతర నాలుగు ఇండియన్ షాపింగ్ కాంప్లెక్స్‌లకు అమెరికా షాక్ ఇచ్చింది. స్నాప్‌డీల్ సహా అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌ను నకిలీ వస్తువులు అమ్మే మార్కెట్ల జాబితాలో చేర్చింది. 2020 సంబంధించి నకిలీ వస్తువులు అమ్మే మార్కెట్ల జాబితాను అమెరికా తాజాగా విడుదల చేసింది. అందులో ఇండియాకు చెందిన అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ అయిన స్నాప్‌డీల్‌తోపాటు ఢిల్లీలోని ట్యాంక్ రోడ్డు, ముంబాయిలోని హీరా పన్నా, కోల్‌కతాలోని కిడర్‌పూర్, ఐజ్వాల్‌లోని మిలీనియం సెంటర్ మార్కెట్‌లను చేర్చింది. కాగా.. స్నాప్‌డీల్‌ను ఈ జాబితాలో చేర్చడంపై అమెరికా వాణిజ్య ప్రతినిధులు వివరణ ఇచ్చారు. 2018 నవంబర్‌లో నిర్వహించిన ఓ సర్వేలో దాదాపు 37శాతం మంది కస్టమర్లు స్నాప్‌డీల్‌లో కొనుగోలు చేస్తే.. తమకు ఆ సంస్థ నకిలీ వస్తువులు డెలివరీ చేసిందని తెలిపారన్నారు. ఇదిలా ఉంటే.. అమెజాన్ ఇండియన్ వెబ్‌సైట్‌ను నకిలీ వస్తువులు అమ్మే మార్కెట్ల జాబితాలో చేర్చడంపట్ల ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ వెబ్‌సైట్‌ను ఆ జాబితాలో చేర్చారని ఆరోపించారు.
నకిలీ సామాను అమ్మే జాబితాలోకి అమెజాన్ ఇండియా
Related tags :